ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి ?? డైలాగ్ దాన వీర సూర కర్ణ
ద్రోణ: నీ కులము
కర్ణ: నేను సూతుడను, సూత కులము.
ద్రోణ: సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు.
సుయోధన:
ఆగాగు, ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి,
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ?
ఎంతమాట ఎంతమాట.
ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు ఇది కుల పరీక్షఏ యందువా, నీ తండ్రి భర్ద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులమో? ఇంత ఏల? అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులమో?
నాతొ చెప్పింతువేమయ్యా ? మా వంసమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేస్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ?
ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతొ మా తండ్రిని, పినపితామహి అంబాలికతొ మా పినతంద్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా ? సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతొ సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థ వాదమెందులకు ?
భీష్మ: నాయన, సుయోధనా!
సుయోధనా: తాతా!
భీష్మ: ఏరులా పారు ఆ బ్రహ్మర్షుల జననములు మనము విచరించదగినవి కావు! (సు: హహ్హహహ్హ!) ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు.
సుయోధనా: ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించునది ? అయిన, మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిపుడే ఈతనిని మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసన! అనర్ఘ నవర్త్న ప్రశస్త కిరీటమును వేగముగ తెమ్ము, మామా గాంధార సార్వభౌమా! సురుచిర-మణిమయ-మండిత సువర్ణ సిమ్హాసనమును తెప్పింపుము, పరిజనులారా! పుణ్య-భాఘిరథీ నదీ తొయములనందుకొనుడు, కళ్యాణభద్రులారా! మంగళ తూర్యరవములు సుస్వరముగ మ్రోగనిండు, వందిమాగధులారా! కర్ణ మహారాజుకు కైవారమును కావింపుదు, పుణ్యాంగనలారా! ఈ రాధసుతునకు ఫాలభాగమున కస్తూరి తిల్కమును తీర్చిదిద్ది బహుజన్మసుకృత-ప్రదీపాజ-సౌలబ్ధ సహజ-కవచకస్య-వైఢూర్య-ప్రభాదిత్యోళికి వాంఛలు చెలరేగ వీర గంధము విజాలార్పుడు. నేనీ సకల మహాజన సంక్షమున, పండిత పరిషన్మధ్యమున సదా, సర్వదా, శతథా సహస్రథా ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళ్ణ గావించెదను.
కర్ణ: దాతా! నా రక్తము రంగరించి అలకులుశాది రేఖాచిగురితములైన మీ అరుణారుణ శుభపాదపద్మయుగళమునకు సౌలేపమను గావించినను మీ ఋణమీగువాడను కాను. ఎచటనూ శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, హితుడనై, మీకు విశ్వాసబద్ధుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను.
సుయోధనా: హితుడా! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసిమ్హాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.
Thursday, February 18, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment