ఆ..
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగా

నీ ఆణ లేనిదే గ్రహింప జాలున వేదాల వానితో విరించి విష్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
కదులును గా సదా సదాశివ
ఆనతి నీయరా హరా
ని నీ స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును ర
ఆనథి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా
జంగమ దెవర సేవలు గొనరా
మంగల దాయక దీవెనలిడ్డర
శాష్టాంగము గ దండము చేతు ర
ఆనతి నీయరా
సానిప గమపనిపమ
గమగ పప పప
మపని పప పప
గగమ గస సస
నిసగ సస సస
సగ గస గప పమ పస నిస
గసని సగ సగ
సని సగ సగ
పగ గగ గగ
సని సగ గ
గసగ గ
పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా
శంకర సంకించకుర
వంక జబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడ నెరుగని గంగనేలి ఈ వంకనేలి నా వంకనొక్క
కడగంతి చూపు పడనీయవేని ని కింకరునిక సేవించుకొందుర
ఆనతి నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ ని స ప ని మ ప గ మ స గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా
గామపని గమాపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకదిమి
మమ పప నినిసమ తక తకిట తకదిమి
పపనినిసస గని తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్ష ధర సిక్షా దీక్ష ధ్రక్ష
విరూపక్ష నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రఖ్స రక్ష అను ప్రార్ధన వినరా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర
దొర సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా
Thursday, February 18, 2016
ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి ?? డైలాగ్ దాన వీర సూర కర్ణ
ద్రోణ: నీ కులము
కర్ణ: నేను సూతుడను, సూత కులము.
ద్రోణ: సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు.
సుయోధన:
ఆగాగు, ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి,
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ?
ఎంతమాట ఎంతమాట.
ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు ఇది కుల పరీక్షఏ యందువా, నీ తండ్రి భర్ద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులమో? ఇంత ఏల? అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులమో?
నాతొ చెప్పింతువేమయ్యా ? మా వంసమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేస్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ?
ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతొ మా తండ్రిని, పినపితామహి అంబాలికతొ మా పినతంద్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా ? సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతొ సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థ వాదమెందులకు ?
భీష్మ: నాయన, సుయోధనా!
సుయోధనా: తాతా!
భీష్మ: ఏరులా పారు ఆ బ్రహ్మర్షుల జననములు మనము విచరించదగినవి కావు! (సు: హహ్హహహ్హ!) ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు.
సుయోధనా: ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించునది ? అయిన, మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిపుడే ఈతనిని మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసన! అనర్ఘ నవర్త్న ప్రశస్త కిరీటమును వేగముగ తెమ్ము, మామా గాంధార సార్వభౌమా! సురుచిర-మణిమయ-మండిత సువర్ణ సిమ్హాసనమును తెప్పింపుము, పరిజనులారా! పుణ్య-భాఘిరథీ నదీ తొయములనందుకొనుడు, కళ్యాణభద్రులారా! మంగళ తూర్యరవములు సుస్వరముగ మ్రోగనిండు, వందిమాగధులారా! కర్ణ మహారాజుకు కైవారమును కావింపుదు, పుణ్యాంగనలారా! ఈ రాధసుతునకు ఫాలభాగమున కస్తూరి తిల్కమును తీర్చిదిద్ది బహుజన్మసుకృత-ప్రదీపాజ-సౌలబ్ధ సహజ-కవచకస్య-వైఢూర్య-ప్రభాదిత్యోళికి వాంఛలు చెలరేగ వీర గంధము విజాలార్పుడు. నేనీ సకల మహాజన సంక్షమున, పండిత పరిషన్మధ్యమున సదా, సర్వదా, శతథా సహస్రథా ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళ్ణ గావించెదను.
కర్ణ: దాతా! నా రక్తము రంగరించి అలకులుశాది రేఖాచిగురితములైన మీ అరుణారుణ శుభపాదపద్మయుగళమునకు సౌలేపమను గావించినను మీ ఋణమీగువాడను కాను. ఎచటనూ శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, హితుడనై, మీకు విశ్వాసబద్ధుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను.
సుయోధనా: హితుడా! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసిమ్హాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.

Subscribe to:
Comments (Atom)